పురుగుల మందు తాగి యువకుడి ఆత్మహత్య
PDPL: గోదావరిఖని ప్రశాంత్ నగర్‌కు చెందిన దాసరి రాజ్ కుమార్ పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు గోదావరిఖని వన్‌టౌన్ ఎస్సై పి.రాజయ్య తెలిపారు. రాజ్‌కుమార్ NTPCలో కాంట్రాక్టు కార్మికునిగా పని చేస్తున్నాడని పేర్కొన్నారు. ఈ మేరకు మృతుని తండ్రి చంద్రయ్య ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని విచారణ చేపడుతున్నట్లు ఎస్సై తెలిపారు.