మిస్ వరల్డ్ పోటీలు.. డ్రోన్ ఎగరవేత నిషేధం

HYD: నగరంలో మే 10 నుంచి 31 వరకు 72వ మిస్ వరల్డ్ 2025 పోటీలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నగరంలోని 10 ప్రాంతాల్లో డ్రోన్లు ఎగరడాన్ని పోలీసులు నిషేధించారు. భారతీయ నాగరిక్ సురక్ష సంహిత 2023లోని సెక్షన్ 163 కింద ఈ నిషేధంపై నిర్ణయం తీసుకున్నారు. మిస్ వరల్డ్ కార్యక్రమ వేదికల నుంచి 3 కి.మీ పరిధి వరకు ఈ నిబంధనలు వర్తిస్తాయని పోలీసులు పేర్కొన్నారు.