భారీ దాడుల ముప్పు.. బాగ్దాద్‌లో హైఅలెర్ట్

భారీ దాడుల ముప్పు.. బాగ్దాద్‌లో హైఅలెర్ట్

ఇరాక్ రాజధాని బాగ్దాద్‌పై అమెరికా ఎంబసీ హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే 48 గంటల్లో ఇరాన్ మద్దతు ఉన్న మిలిటెంట్లు బాగ్దాద్‌లోని కేంద్ర ప్రాంతాలలో భారీ దాడులకు పాల్పడే అవకాశముందని తెలిపింది. US పౌరులు, దౌత్య కార్యాలయాలు, విమానాశ్రయాలే లక్ష్యంగా దాడులు జరగొచ్చని, వెంటనే అమెరికన్లు దేశం విడిచి వెళ్లాలని సూచించింది. దీంతో బాగ్దాద్‌లో హైఅలెర్ట్ ప్రకటించారు.