పిఎన్జతో వంట గ్యాస్ సరఫరాకు కసరత్తు
NRPT: భవిష్యత్తులో ఎల్పీజీ గ్యాస్ కొరతను అధిగమించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో PNG( పైపుడ్ నాచురల్ గ్యాస్) తో కమర్షియల్ అవసరాలకు వంట గ్యాస్ సరఫరాకు కసరత్తు చేస్తున్నట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. బుధవారం సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ జిల్లా కమిటీ సభ్యులతో పీఎన్జీ గురించి కలెక్టరేట్‌లోని తన ఛాంబర్ మాట్లాడారు.