మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా రూప

నల్లగొండ: పట్టణానికి చెందిన దుబ్బ రూప మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా నియమితులయ్యారు. మహిళా కాంగ్రెస్‌కు సంబంధించి అత్యధిక సభ్యత్వాలు చేయించడంతో మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు మొగిలి సునీత రావు ఆమెను రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసారు. ఈ సందర్భంగా దుబ్బ రూపా రాష్ట్ర అధ్యక్షురాలికి కృతజ్ఞతలు తెలిపారు.