పోషణ పక్వాడ కార్యక్రమం
AKP: గొలుగొండ మండలం ఏఎల్.పురం అంగన్వాడీ కేంద్రం-4లో పోషణ్ పక్వాడా కార్యక్రమంలో భాగంగా పిల్లల తల్లులకు బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సీడీపీవో శ్రీ గౌరీ పాల్గొన్నారు. పిల్లల మెదడు అభివృద్ధి తొలి రెండేళ్లలో కీలకమని, పోషకాహారం, భాషాభివృద్ధి, ఆటల ప్రాముఖ్యతపై వివరించారు. తల్లులు జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యమని తెలిపారు.