దివ్యాంగ విద్యార్థులకు ల్యాప్ టాప్‌ల పంపిణీ

SKLM: డిగ్రీ ఆపైన చదువుతున్న దివ్యాంగ విద్యార్థులకు శ్రీకాకుళంలోని జెడ్పీ కార్యాలయంలో జిల్లా విభిన్న ప్రతిభావంతులు, హిజ్రా, వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఐదు ల్యాప్ టాప్లు, ఒక టచ్ ఫోన్‌ను శ్రీకాకుళం ట్రైనీ కలెక్టర్ పృథ్వి రాజ్ కుమార్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. వారు చదువులలో మరింత రాణించడానికి ఇవి తోడ్పడతాయని ట్రైనీ కలెక్టర్ ఆకాంక్షించారు.