ముస్లిం మైనార్టీ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక
PDPL: సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామంలో ముస్లిం మైనార్టీ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ముస్లిం మైనార్టీ సంక్షేమ సంఘం సభ్యులు ఏకగ్రీవంగా గ్రామ అధ్యక్షుడిగా మహమ్మద్ హుస్సేన్‌ను ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడిగా ఎండీ.షఫియొద్దీన్, జనరల్ సెక్రటరీగా ఎండీ.ముస్తఫా, సెక్రటరీగా ఎండీ. నాజర్, క్యాషియర్‌గా ఎండీ.నయీమ్, సభ్యులను ఎన్నుకున్నారు.