ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్ ఇలా త్రిపాఠి
NLG: జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా మొదటి విడతన 14 మండలాలలోని 318 గ్రామపంచాయతీలలో ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. బుధవారం ఆమె నల్గొండ జిల్లా కేంద్రంలోని ఇంద్రారెడ్డి ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల పోలింగ్ సామాగ్రి పంపిణీ, స్వీకరణ కేంద్రాన్ని తనిఖీ చేశారు.