'పౌష్టికాహారం అందజేయాలి'

ప్రకాశం: పొన్నలూరు ఎస్సీ కాలనీ అంగన్వాడీ సెంటర్‌లో సోమవారం పోషణ్ పక్వాడా కార్యక్రమాన్ని నిర్వహించారు. సూపర్‌వైజర్ రమాదేవి అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారుల బరువులను, కొలతలను పరిశీలించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పౌష్టికాహారాన్ని చిన్నారులకు, గర్భిణీలకు, బాలింతలకు క్రమం తప్పకుండా అందజేయాలన్నారు.అలాగే అవగాహన కల్పించాలన్నారు.