నల్లమలలో పెరుగుతున్న పెద్ద పులుల సంఖ్య
NDL: నల్లమలలోని నాగార్జునసాగర్-శ్రీశైలం అభయారణ్యంలో పెద్దపులుల గణన ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేట్(ఏఐటీఈ) చేపట్టింది. ఏఐటీఈ నివేదికల ప్రకారం నల్లమల అభయారణ్యంలో పెద్దపులుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని మంగళవారం నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ విగ్నేష్ అప్పారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.