ఆస్తిపన్ను ముందస్తు చెల్లింపుకు రాయితీ
GDWL: 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తిపన్నును ముందస్తుగా చెల్లించే యజమానులకు ప్రభుత్వం 5 శాతం రాయితీ అందిస్తుందని వడ్డేపల్లి మున్సిపల్ కమిషనర్ రాజయ్య తెలిపారు. పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని సకాలంలో పన్నులు చెల్లించాలని సూచించారు. మున్సిపాలిటీ అభివృద్ధికి అందరూ సహకరించాలని ఆయన కోరారు.