రోడ్లపై విరిగిపడిన కొండచరియలు

రోడ్లపై విరిగిపడిన కొండచరియలు

PPM: పాచిపెంట మండలం గొట్టూరు, ఎగువ గొట్టూరు, బొర్రమామిడి, మూటకూడు, బొడ్డపాడు గ్రామాలకు వెళ్లే రహదారి మధ్యలో కొండచరియలు విరిగి పడ్డాయి. మంగళవారం రాత్రి పడిన భారీ వర్షాలకు కన్నయ్య వలస-పై గ్రామాలకు వెళ్లే బీటీ రోడ్డుపై ఈ పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.