ప్రభుత్వ ఆసుపత్రికి ఆక్సిజన్ సిలిండర్ సెట్ వితరణ

PPM: పాలకొండ ఏరియా ఆస్పత్రికి ఆక్సిజన్ సిలిండర్ ను దాతలు వితరణగా అందించారు. పాలకొండ నెయ్యల వీధికి చెందిర పండూరు శంకరాచార్యులు ఇటీవల మరణించారు. అతని పేరు మీద అతని కుమారులు శ్రీనివాసరావు, కృష్ణ, మనవడు సంతోశ్ కలిసి ఆక్సిజన్ సిలిండర్ సెట్ వితరణగా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జి. నాగభూషణానికి శుక్రవారం అందజేశారు.