మండలంలో విస్తృతంగా పర్యటించిన డీఈవో
NDL: చాగలమర్రి మండలంలో జిల్లా విద్యాధికారి జనార్దన్ ఇవాళ పర్యటించారు. ఈ సందర్భంగా మద్దూరులోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ నేపథ్యంలో విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టి వారి సామర్థ్యాలను పరీక్షించారు. పాఠశాల పరిసరాలను గమనించి, నిర్వహణ విషయంలో సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో పాల్గొన్నారు.