VIDEO: లక్ష్మీ నగర్‌లో అద్వానంగా డ్రైనేజీ వ్యవస్థ
SKLM: నరసన్నపేట మండలం లక్ష్మీ నగర్ వీధులలోని డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా తయారయ్యిందని స్థానికులు అంటున్నారు. డ్రైనేజీలలో పూడికతీత పనులు చేపట్టకపోవడంతో దుర్వాసన, దోమల బెడద అధికంగా ఉంటుందని పేర్కొన్నారు. వ్యాధుల సంక్రమించే అవకాశం ఎక్కువగా ఉన్నాయని భయపడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి, వెంటనే పూడికతీత పనులను చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.