'పీ-4తో ఆర్థిక అసమానతలకు స్వస్తి'

PLD: P4 అమలుతో ఆర్థిక సామాజిక, అసమానతలకు స్వస్తి పలకవచ్చని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. మంగళవారం చిలకలూరిపేటలోని ఆయన నివాసంలో మాట్లాడారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలనతో పాటు ఏపీ ఆర్థిక అభివృద్దే లక్ష్యంగా పథకం అమలు దిశగా ప్రభుత్వం అడుగులేస్తుందన్నారు. అట్టడుగున ఉన్న 20 శాతం పేద కుటుంబాలను ఆర్థికంగా ఎదిగేలా చేయాలనదే కూటమి సంకలపమన్నారు.