మల్లాపూర్ గోండు గూడెం సర్పంచ్‌గా 75 ఏళ్ల వృద్ధురాలు

మల్లాపూర్ గోండు గూడెం సర్పంచ్‌గా 75 ఏళ్ల వృద్ధురాలు

నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలం మల్లాపూర్ గోండు గూడెం సర్పంచ్‌గా చిక్రం జంగు బాయి (75) గెలుపొందారు. సమీప ప్రత్యర్థి అభ్యర్థిపై 179 ఓట్ల మెజార్టీతో ఆమె విజయం సాధించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు.