చంద్రబాబు నాకు స్నేహితుడు: ఉపరాష్ట్రపతి
AP: వ్యాపార అనుకూల రాష్ట్రంగా ఏపీ నిలిచిందని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. 'మూడు దశాబ్దాలుగా చంద్రబాబు నాకు స్నేహితుడు. ఏపీలో వ్యాపారానికి ప్రశాంతమైన వాతావరణం ఉంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. చంద్రబాబు సారథ్యంలో ఏపీకి అనేక పెట్టుబడులు వచ్చాయి. పెట్టుబడిదారులను ఆకర్షించే విషయంలో చంద్రబాబు ముందుంటారు' అని వెల్లడించారు.