'గుడి నిర్మాణానికి రూ. 50వేల విరాళం'
NGKL: బల్మూర్ మండలంలోని పోలిశెట్టిపల్లి తండాకు చెందిన రామావత్ పవన్ నాయక్, మధు నాయక్‌లు తమ దాతృత్వం చాటుకున్నారు. గ్రామంలోని అభయ ఆంజనేయస్వామి గుడి వద్ద రేకుల షెడ్డు నిర్మాణం కోసం సోమవారం వారు రూ. 50వేల విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ శ్రీరామ్ వారిని అభినందించారు. దేవాలయ అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని ఆయన పేర్కొన్నారు.