జీవన్ రెడ్డితో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ భేటీ

జీవన్ రెడ్డితో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ భేటీ

TG: మాజీ మంత్రి జీవన్ రెడ్డితో PCC చీఫ్ మహేష్ గౌడ్ భేటీ అయ్యారు. ఈ భేటీలో AICC కార్యదర్శిలో సచిన్ సావంత్, అది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ క్రమంలో తన డిమాండ్స్‌ని జీవన్ రెడ్డి.. మహేష్ కుమార్ ముందుంచారు. ఢిల్లీ పెద్దలకి వివరిస్తానని, తొందరపాటు నిర్ణయాలు వద్దని మహేష్ కుమార్ సర్ది చెప్పారు. కాగా పార్టీలో ఉండలేనంటూ ఇటీవల జీవన్ రెడ్డి లేఖ విడుదల చేసిన విషయం తెలిసిందే.