'స్టేషన్స్‌లో రికార్డులు సక్రమంగా ఉండాలి'

'స్టేషన్స్‌లో రికార్డులు సక్రమంగా ఉండాలి'

GNTR: పోలీస్ స్టేషన్లలో రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉన్నప్పుడే న్యాయస్థానాల ద్వారా నేరస్థులకు కఠిన శిక్షలు వేయించగలమని ఎస్పీ సతీశ్ కుమార్ అన్నారు. గుంటూరు ఈస్ట్ పోలీస్ స్టేషన్ సబ్- డివిజన్ కార్యాలయాన్ని శుక్రవారం ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోక్సో, గంజాయి, తీవ్రనేరాలకు సంబంధించిన కేసుల రికార్డులను ఎస్పీ పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.