VIDEO: జిల్లా దాహార్తిని తీరుస్తున్న నరవ డ్యామ్

VIDEO: జిల్లా దాహార్తిని తీరుస్తున్న నరవ డ్యామ్

విశాఖ నగర నీటి అవసరాలను తీర్చడంలో మేఘాద్రి గెడ్డ రిజర్వాయర్ (నరవ డ్యామ్) కీలకంగా మారింది. ఈ రిజర్వాయర్ ద్వారా రోజుకు 10 మిలియన్ గ్యాలన్లకు పైగా తాగునీరు సరఫరా అవుతోంది. అదే సమయంలో జీవీఎంసీ ఏర్పాటు చేసిన 3 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ ద్వారా పర్యావరణ హితమైన విద్యుత్ ఉత్పత్తి కూడా కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.