8 టేకు దుంగలు స్వాధీనం

8 టేకు దుంగలు స్వాధీనం

MNCL: దండేపల్లి మండలంలోని తాళ్ల పేట అటవీ రేంజ్ కొత్త మామిడిపల్లి గ్రామంలో ఎనిమిది టేకు దుంగలను స్వాధీనం చేసుకున్నామని స్థానిక ఎఫ్ఆర్ఓ సుష్మారావు తెలిపారు. ఆ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ఇంటిపై రైడ్ నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా రూ. 33,606 విలువ చేసే 8 టేకు దుంగలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో అటవీ అధికారులు పాల్గొన్నారు.