కార్వేటినగరం సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ
CTR: కార్వేటినగరం చిన్న ఎస్సీ కాలనీలో CC రోడ్డు నిర్మాణానికి గురువారం భూమి పూజ నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామంలో సీసీ రోడ్డు నిర్మించాలని గ్రామస్తులు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ దృష్టికి తీసుకువెళ్ళడంతో స్పందించిన ఆయన రోడ్డు మంజూరు చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... త్వరలోనే డ్రైనేజీ కాలువల నిర్మాణం కూడా చేపట్టనున్నట్టు ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు.