చీరాల మున్సిపల్ ఛైర్మన్ పదవికి శ్రీనివాసరావు రాజీనామా

బాపట్ల: చీరాల మున్సిపల్ ఛైర్మన్ పదవికి జంజనం శ్రీనివాసరావు రాజీనామా చేశారు. టీడీపీ కౌన్సిలర్లు ఆయనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఛైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు శ్రీనివాసరావు ప్రకటించారు. మరోవైపు ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు అవిశ్వాస తీర్మానంపై సమావేశం నిర్వహిస్తున్నారు. ఇందులో ఎంపీ కృష్ణప్రసాద్, ఎమ్మెల్యే కొండయ్య హాజరయ్యారు.