పశువుల అక్రమ రవాణాకు చెక్

VSP: ఆరిలోవ ముస్తఫా కాలనీలో అక్రమ వదకు తీసుకుని వెళుతున్న ఐదు ఆవులను స్థానికులు అడ్డుకుని ఆరిలోవ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వ్యాపారిని, వాహన డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు సీఐ మల్లేశ్వరరావు పేర్కొన్నారు. ఐదు ఆవులను తగరపువలసలోని యానిమల్ వెల్ఫేర్ సొసైటీకి అప్పగించినట్లు తెలిపారు.