చెట్టును ఢీకొన్న కారు.. ఇద్దరు మృతి
NTR: NLR జిల్లా గుడ్లూరు (మ) జరిగిన రోడ్డు ప్రమాదంలో NTR జిల్లా జీ.కొండూరు చెవుటూరు గ్రామానికి చెందిన దంపతులు గుమ్మడపు మురళీకృష్ణ (64), మాధవీలత (56) మృతి చెందారు. తిరుపతి దర్శనం ముగించుకుని చిన్నకుమార్తె నిఖితతో తిరిగి వస్తుండగా, కారు అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. దంపతులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందగా, నిఖితకు వెన్నెముకకు గాయాలయ్యాయి.