దివ్యాంగుల అప్పీల్‌కు నోటిఫికేషన్ జారీ

GNTR: దివ్యాంగుల పెన్షన్ అప్పీల్ ప్రక్రియకు నోటీసులు అందుకున్న వారు తాము అర్హులమని భావించినట్లయితే సమీప మున్సిపల్ కార్యాలయాల్లో అర్జీలు ఇవ్వవచ్చని పొన్నూరు ఎంపీడీవో చంద్రశేఖరరావు మంగళవారం తెలిపారు. అర్జీలు అందించినవారు వైద్యశాలకు హాజరుకావాలని నోటీసు ద్వారా తెలియజేస్తామన్నారు. అర్జీలను పెన్షన్ పోర్టల్‌లో అప్లోడ్ చేసి వివరాలు తెలియజేస్తామన్నారు.