సీసీ కెమెరాల మరమ్మతులు త్వరలోనే నిర్వహిస్తాం: ఎస్సై

సీసీ కెమెరాల మరమ్మతులు త్వరలోనే నిర్వహిస్తాం: ఎస్సై

ప్రకాశం: పొదిలిలోని పలు ప్రాంతాలలో సీసీ కెమెరాలపై దృష్టి సారించామని సోమవారం ఎస్సై వి.వేమన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల దాతల సహకారంతో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ఎండకు, వర్షానికి, గాలికి పాడైపోయిన విషయం తన దృష్టికి వచ్చిందని, టెక్నీషియన్‌కు సమాచారం అందించగా అతను అనారోగ్యం కారణం వల్ల కొంత జాప్యం జరిగిందనీ, త్వరలోనే మరమ్మత్తులు చేస్తాం అన్నారు.