VIDEO: కుటుంబ కలహాలతోనే డ్రైవర్ ఆత్మహత్యాయత్నం
KMM: ఖమ్మంలో RTC డ్రైవర్ గూడూరు లింగారెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. టూటౌన్ పోలీసులు ఆస్పత్రికి వెళ్లి లింగారెడ్డి, ఆయన భార్య స్టేట్ మెంట్ రికార్డు చేశారు. లింగారెడ్డి తన భార్య పెడుతున్న ఇబ్బందులకు ఆత్మహత్యాయత్నం చేసినట్లు చెప్పాడని, ఆయన భార్య మాత్రం మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని ఆమెకు డబ్బులు ఇస్తున్నాడని ఆరోపించింది.