సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన రిటైర్డ్ ఉద్యోగి

సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన రిటైర్డ్ ఉద్యోగి

KMM: సైబర్ నేరగాళ్ల చేతిలో ఓ రిటైర్డ్ ఉద్యోగి మోసపోయాడు. ఖమ్మం యూపీహెచ్ కాలనీకి చెందిన రిటైర్డ్ ఉద్యోగి ఈ.పుల్లయ్య ఫోన్‌కి బ్యాంకు బ్యాలెన్స్ చెక్ చేసుకోమంటూ ఓ మెసేజ్ వచ్చింది. దానిపై ఆయన క్లిక్ చేయగానే రూ.99,820 నగదు విత్ డ్రా కావడంతో సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయినట్లు గుర్తించాడు. దీంతో ఆయన ఫిర్యాదుతో ఖమ్మం అర్బన్ పోలీసులు కేసు నమోదు చేశారు.