సమంత మెచ్చిన ఇన్‌స్టా రీల్

సమంత మెచ్చిన ఇన్‌స్టా రీల్

సోషల్ మీడియాలో ఓ మహిళా టైలర్ తన ఎడిటింగ్ టాలెంట్‌తో ఏకంగా స్టార్ హీరోయిన్ సమంత దృష్టినే ఆకర్షించింది. గతంలో యాంకర్ సుమతో సమంత మాట్లాడిన వీడియో కాల్ క్లిప్‌ను వాడుకుని, ఆ హీరోయిన్ నేరుగా తనతోనే మాట్లాడుతున్నట్లుగా ఆమె అద్భుతంగా ఎడిట్ చేసింది. ఈ వీడియో చూసి ఆశ్చర్యపోయిన సమంత.. ఆ మహిళ ప్రతిభను మెచ్చుకుంటూ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేయడంతో వైరల్ అవుతోంది.