ఒంటి పూట బడులు.. ఎండలో విద్యార్థుల అవస్థలు

ఒంటి పూట బడులు.. ఎండలో విద్యార్థుల అవస్థలు

VKB: కొండగల్ పట్టణంలో ఒంటి పూట బడుల కారణంగా మధ్యాహ్న సమయంలో పాఠశాల ముగియడంతో ఎండలో విద్యార్థులు ఇళ్లకు వెళ్తున్నారు. గ్రామాలకు ఆ సమయంలో వాహనాలు లేకపోవడంతో విద్యార్థులు కాళినడకన వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. దీంతో వడదెబ్బతో నీరసించి, అరికాళ్లకు బొబ్బలు వస్తున్నాయని వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి బస్సు సౌకర్యం కల్పించాలని వారు కోరుతున్నారు.