ప్రైవేట్ పాఠశాలపై దాడి చేసిన ఏడుగురిపై కేసు నమోదు

ప్రైవేట్ పాఠశాలపై దాడి చేసిన ఏడుగురిపై కేసు నమోదు

గద్వాలలోని ఓ పాఠశాలపై దాడి చేసిన ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. విద్యార్థి సంఘం నాయకుడు మాజ్, మరికొందరు పాఠశాలపై దాడి చేసి ఉపాధ్యాయులపై దౌర్జన్యం చేసి, పూల కుండీలు, ఫ్లెక్సీలు చించేశారు. ఓ మహిళా ప్రిన్సిపల్ అని చూడకుండా దుర్భాషలాడినట్లు సమాచారంతో ఈ కేసు నమోదైంది. ఈ దాడి గురించి ఎస్సై కళ్యాణ్ కుమార్ వివరాలు వెల్లడించారు.