కాలుష్యాన్ని వ్యాప్తి చేస్తున్న రాంకీ పరిశ్రమ
AKP: పరవాడ మండలం తాడి గ్రామం సమీపంలో రాంకీ ఫార్మా పరిశ్రమ కాలుష్యాన్ని వెదజల్లుతుందని సీఐటీయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గనిశెట్టి తెలిపారు. ఘన వ్యర్థాలను గ్రామ సమీపంలో డంప్ చేసి నిప్పు పెట్టడంతో వ్యాపించే పొగ కారణంగా ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారన్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.