ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్
KMM: గ్రామపంచాయతీ ఎన్నికల సన్నద్ధతపై కలెక్టర్ జితేష్ వి పాటిల్ వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ ఎన్నికలకు సంబంధించి నియమ, నిబంధనలపై పూర్తి అవగాహన ఉండాలని అధికారులకు సూచించారు. బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామాగ్రిని జాగ్రత్తగా సరి చూసుకోవాలని అన్నారు. పోలింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ, యుద్ధప్రాతిపదికన సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.