'తడిసిన వడ్లను ప్రభుత్వం కొనుగోలు చేయాలి'

'తడిసిన వడ్లను ప్రభుత్వం కొనుగోలు చేయాలి'

WNP: గోపాల్‌పేట మండలం చాకలిపల్లి గ్రామంలో బుధవారం రాత్రి కురిసిన వర్షానికి గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో వడ్లు తడిసిపోయాయి. తడిసిన వడ్లను చూసి రైతులు ఆందోళనలకు గురవుతున్నారు. తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రోజు వర్షం పడుతుండటంతో ప్రభుత్వం వడ్లను త్వరగా కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.