విమానాల రాకపోకలకు అంతరాయం లేదు: కేంద్రమంత్రి
ఎయిర్‌పోర్టులో GPS స్పూఫింగ్ సమస్యను కాంటిజెన్సీ ప్రొసీజర్లతో పరిస్థితిని అధిగమించామని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. విమానాల రాకపోకలకు అంతరాయం లేదని స్పష్టం చేశారు. సంప్రదాయ నావిగేషన్‌తో రన్‌వేను ఆపరేట్ చేశారని చెప్పారు. మాల్వేర్ ద్వారా సైబర్ దాడులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అడ్వాన్స్డ్ సైబర్ సెక్యూరిటీతో అడ్డుకుంటున్నామని వెల్లడించారు.