జిల్లాలో అదనపు ఇసుక రేవులకు అనుమతులు జారీ
BPT: ప్రజల అవసరాల కోసం అదనపు ఇసుక రేవులకు అనుమతులను మంజూరు చేసినట్లు కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీక్షణ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో ప్రజల అవసరాల కోసం కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో నూతనంగా 2 ఇసుక రేవులకు అనుమతి మంజూరు చేసినట్లు తెలిపారు.