పేకాట శిబిరంపై దాడి.. ఐదుగురు అరెస్ట్
శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలోని బెజ్జిపురం వద్ద ఒక మిల్లులో పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో ఐదుగురిని అదుపులోకి తీసుకుని, 4,700 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్ఐ ఎస్. ప్రసాదరావు తెలిపారు. ఐదుగురిపై స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసారు