VIDEO: పీహెచ్‌సీలో చెట్ల నరికివేత.. స్థానికుల ఆగ్రహం
WGL: పర్వతగిరి మండల కేంద్రంలోని ప్రభుత్వ పీహెచ్‌సీ దవాఖానలో పరిశుభ్రత పేరిట చెట్లను నరికివేయడంపై గురువారం స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెట్ల తొలగింపుతో ఆసుపత్రికి వచ్చే రోగులు నీడ లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. నరికిన చెట్ల స్థానంలో మొక్కలు నాటాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని హెల్త్, ఫారెస్ట్ అధికారులకు స్థానికులు విజ్ఞప్తి చేశారు.