పీడీఎస్ కేంద్రాల్లో ఆర్డీవో ఆకస్మిక తనిఖీ
సత్యసాయి: ధర్మవరం రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీవో) మహేష్ ధర్మవరం విభాగం పరిధిలోని ఎంఎల్‌ఎస్ పాయింట్లతో పాటు పలు రేషన్ దుకాణాలను (ఎఫ్‌పీ షాపులను) ఆకస్మికంగా తనిఖీ చేశారు. తహసీల్దార్, వీఆర్వోలతో కలిసి ప్రజా పంపిణీ వ్యవస్థ అమలు తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా స్టాక్ రిజిస్టర్లు, తూకం యంత్రాలు, సరుకుల నాణ్యతను సమీక్షించారు.