యూరియాను సకాలంలో అందించాలని కోరుతూ రాస్తారోకో
KMR: రైతులకు యూరియాను సకాలంలో అందించాలని కోరుతూ ఎల్లారెడ్డి మండలం గండి మాసానిపేట రోడ్డుపై బుధవారం రైతులు ఆందోళన చేపట్టారు. రైతుల అవసరాలకు అనుగుణంగా వ్యవసాయ అధికారులు యూరియాను పంపిణీ చేసి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరిన పట్టించుకోవడంలేదని రైతులు నిరసన వ్యక్తం చేశారు. యూరియా సకాలంలో అందే విధంగా చూడాలని డిమాండ్ చేశారు.