'పిచ్చి రొచ్చు రివ్యూలు రాయడం చాలా సులభం'
సినిమా రివ్యూల తీరుపై సీనియర్ జర్నలిస్ట్ నాగేంద్ర కుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. శర్వానంద్ 'బైకర్' మూవీ సక్సెస్ మీట్‌లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. 'పిచ్చి రొచ్చు రివ్యూలు రాయడం చాలా సులభం. కనీసం ఇమిటేషన్‌కు, ఇన్‌స్పిరేషన్‌కు మధ్య ఉన్న తేడా తెలియని వారు కూడా సినిమా రివ్యూలు రాస్తుండటం సినీ ఇండస్ట్రీకి పట్టిన దౌర్భాగ్యం' అని ఆవేదన వ్యక్తం చేశారు.