ఆక్రమణలపై ఎమ్మెల్యే బండారు సమీక్ష
కోనసీమ: రావులపాలెంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారమే ముఖ్యోద్దేశంగా శుక్రవారం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు డిఎస్పి సుంకర మురళీమోహన్, హైవే పిడి బి కృష్ణమూర్తి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆక్రమణలను తొలగించి ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలన్నారు. రహదారి ఆక్రమణలను తొలగించాలన్నారు. సర్వీస్ రోడ్లను వెడల్పు చేసి, డ్రెయిన్లు నిర్మించి సౌకర్యవంతంగా చేయాలన్నారు