రావులపర్రులో భగీరథ మహర్షి జయంతి

రావులపర్రులో భగీరథ మహర్షి జయంతి

ELR: ఉంగుటూరు మండలం రావులపర్రు గ్రామంలో శ్రీ భగీరథ మహర్షి జయంతి వేడుకలు ఆదివారం జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా యువజన సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు గాది వెంకటరమణ ఆధ్వర్యంలో భగీరథ మహర్షికి పాలభిషేకం చేసి, వృద్దులకు పళ్ళు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముత్యాల రావు, నరసింహమూర్తి, వెంకన్న బాబు, రాజకుమార్, తాతారావు,నరేష్, శివకేశవరావు తదితరులు పాల్గొన్నారు.