VIDEO: అరటి రైతులపై దళారీ దోపిడీ
KDP: పులివెందుల నియోజకవర్గంలో అరటి రైతులను దళారీ వ్యవస్థ దోచుకుంటోందని రైతులు వాపోతున్నారు. దళారీ వ్యవస్థ తెల్లవారేసరికి రేటు నిర్ణయిస్తూ కొనుగోలు వ్యవస్థతో చేయి కలిపి రైతులను ముంచే కార్యక్రమం చేపడుతోందన్నారు. మొన్నటి వరకు రూ. 25,000 పలికిన అరటి ధర.. ప్రస్తుతం నాలుగైదు వేలు పలకడం ఇది దళారీ వ్యవస్థ పనేనని రైతులు ఆరోపించారు.