'దీపావళి టపాసుల విషయంలో అప్రమత్తత అవసరం'
SDPT: దుబ్బాక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ హేమరాజ్ సింగ్ దీపావళి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. దీపావళి మీఇంట్లో వెలుగులు నింపాలి తప్ప చీకటి నింపకూడదని, టపాసులు కాల్చే ముందు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా చిన్న పిల్లలు టపాసులు కాల్చే సమయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.