VIDEO: పొలంలో ఇసుక మేటలు కన్నీటిపరమైన రైతులు

VIDEO: పొలంలో ఇసుక మేటలు కన్నీటిపరమైన రైతులు

ములుగు జిల్లాలో భారీ వర్షాలు, వరదలకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. మంగళవారం ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లికి చెందిన ఓ మహిళా రైతు తన వరి పొలంలో ఇసుక మేటలు వేశాయని కంటతడి పెట్టింది. ఉద్ధృతంగా ప్రవహించిన వరద కారణంగా సుమారు 20 ఎకరాల్లో పూర్తిగా పంట దెబ్బతినడంతో గుండెలు విలపించేలా కన్నీరు పెట్టింది.